Friday, November 22, 2024

Breaking: పెరల్స్ చిట్స్ స్కామ్ – మరో 11 మందిని అరెస్టు చేసిన సీబీఐ..

పెరల్స్ గ్రూప్ స్కామ్ కేసులో మరో 11 మందిని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) ఇవ్వాల అరెస్టు చేసింది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఐదు కోట్ల మంది పెట్టుబడిదారుల నుంచి అనధికార స్కీమ్ లతో సుమారు 60వేల కోట్లు వసూలు చేసిన కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఢిల్లీ, చండీగఢ్, కోల్‌కతా, భువనేశ్వర్ తదితర ప్రాంతాల నుండి పెరల్స్ గ్రూప్ ఉద్యోగులు, వ్యాపారవేత్తలతో సహా మొత్తం 11 మందిని అరెస్టు చేసినట్లు సీబై సీనియర్ అధికారి తెలిపారు.

వివిధ పెట్టుబడి స్కీమ్ లను చట్టవిరుద్ధంగా నిర్వహించడం ద్వారా దేశవ్యాప్తంగా ఐదు కోట్ల మంది ఇన్వెస్టర్ల నుంచి సుమారు 60,000 కోట్లు వసూలు చేసిన పెరల్స్ గ్రూప్‌పై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ గతంలో ప్రాథమిక విచారణను చేపట్టిందని ఆయన తెలిపారు. పెట్టుబడిదారులను మోసం చేసే ఉద్దేశంతోనే ఈ స్కీములను ప్రవేశపెట్టినట్టు తమ విచారణలో తెలిసిందన్నారు. సీబీఐ విచారణ ఆధారంగా పలువురు ఎమ్మెల్యేలపై కేసు నమోదైంది. పెరల్స్ గ్రూప్ లిమిటెడ్ (PGF), M/s. PACL లిమిటెడ్, నిర్మల్ సింగ్ భాంగూ, పెరల్స్ గ్రూప్ నకు చెందిన ఈ రెండు ఫ్లాగ్‌షిప్ కంపెనీల డైరెక్టర్లతో సహా ఇతరులు ఈ కేసులో నిందితులుగా ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement