గత ప్రభుత్వాలు ఆదివాసీలను పట్టించుకోలేదని, అందుకే నేటికీ వెనకబాటుతనం ఉందన్నారు ప్రధాని మోడీ. తమ ప్రభుత్వం వారికి అన్నివిధాలా అండగా ఉంటుందన్నారు. ఆదివాసీ గిరిజన యోధుడు బిర్సా ముండా జయంతి సందర్భంగా భోపాల్‌లో నిర్వహించిన జన జాతీయ గౌరవ్ దివస్ వేడుకలకు ప్రధాని హాజరై ప్రసంగించారు. జనజాతీయ గౌరవ్ దివస్ పేరుతో కేంద్రం బిర్సా ముండా జయంతి వేడుకలను నిర్వహిస్తోందన్నారు.
రాణి కమలాపతి వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్‌ను కూడా ప్రధాని మోడీ ప్రారంభించారు. ఎయిర్‌పోర్ట్‌లో ఉండే వసతులన్నీ ఈ రైల్వేస్టేషన్‌లో ఉండేలా తీర్చిదిద్దారు. 50 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లను కూడా ప్రారంభించారు మోడీ. రేషన్ ఆప్ కే గ్రామ్.. ఇంటి దగ్గరకే రేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతకుముందు జార్ఖండ్ రాజధాని రాంచిలో ఏర్పాటు చేసిన బిర్సా ముండా ట్రైబల్ మ్యూజియాన్ని వర్చువల్‌గా ప్రారంభించారు మోడీ.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily
తెలంగాణలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గిరిజన ఆరాధ్య యోధుడు బిర్సా ముండా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు