సోషల్ మీడియాలో పదో తరగతి ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ లీక్ అయింది. శ్రీసత్యసాయి జిల్లా ఆమడగూరు పాఠశాల నుంచి ఇంగ్లిష్ పేపర్ లీకయిందనే వార్తలు వచ్చాయి. ఈ సంఘటనకు సంబంధించి అధికారి ఒకరిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. కాగా మరో జూనియర్ అసిస్టెంట్ పరారీలో ఉన్నాడు. సత్యసాయి జిల్లా గాండ్లపెంటలో టెన్త్ ఇంగ్లిష్ పేపర్ లీక్ అయింది. పరీక్ష మొదలైన పది నిమిషాలకే పేపర్ స్థానిక వాట్సాప్ గ్రూపుల్లో ప్రత్యక్షమైంది. ఈ విషయాన్ని అధికారులు నిర్ధారించారు. ఈ పేపర్ లీకేజీకి సెంటర్ సూపరింటెండెంట్, హెడ్మాస్టర్ విజయ్‌కుమార్, జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్‌రావులను సూత్రధారులుగా అనుమానిస్తున్నారు. కాగా, విజయ్‌కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తుండగా.. జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్‌రావు పరారీలో ఉన్నట్లు అధికారులు చెప్పారు.
Breaking : సత్యసాయి జిల్లా గాండ్లపెంటలో – టెన్త్ ఇంగ్లిష్ పేపర్ లీక్ – ఒకరి అరెస్ట్
Advertisement
తాజా వార్తలు
Advertisement