పాకిస్థాన్ పార్లమెంట్ లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.. అవిశ్వాస పరీక్ష జరగకుండానే ఎన్నికలకు వెళ్లేలా స్కెచ్ వేశారు ఇమ్రాన్ ఖాన్.. అవిశ్వాసంపై ఓటింగ్ జరగకుండా స్పీకర్ ద్వారా పావులు కదిపారు ఇమ్రాన్ ఖాన్..దాంతో ఇమ్రాన్ ఖాన్ పై అవిశ్వాస తీర్మానాన్ని స్పీకర్ తోసి పుచ్చారు.., కాగా ఇమ్రాన్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నాయి విపక్షాలు.. దాంతో ఇమ్రాన్ ఖాన్ భవితవ్యం పాకిస్థాన్ సుప్రీంకోర్టు నిర్ణయంపైనే ఆధారపడి ఉంది. పాకిస్థాన్ లో మధ్యంతర ఎన్నికలు జరగనున్నాయి. పాక్ అసెంబ్లీని రద్దు చేయాలని అధ్యక్షుడికి ఇమ్రాన్ సిఫారసు చేశారు. 90రోజుల్లోగా ఎన్నికలు నిర్వహించాలని పాక్ అధ్యక్షుడు ఆదేశాలు జారీ చేశారు. పాకిస్థాన్ భవిష్యత్తును ప్రజలే నిర్ణయిస్తారని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. పాక్ లో ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగాలని ఆయన అన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement