సుప్రీంకోర్టుకు వారం రోజుల పాటు దసరా పండుగను పురస్కరించుకుని సెలవులు ప్రకటించారు. అక్టోబర్ 3 నుంచి మొదలు కానున్న ఈ సెలవులు 9వ తేదీ వరకు కొనసాగనున్నాయి. దసరా సెలవులను ముగించుకుని సుప్రీంకోర్టు తిరిగి అక్టోబర్ 10 నుంచి యథాతథంగా పనిచేయనుంది. ఈ మేరకు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ దసరా సెలవులకు సంబంధించి శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement