తిరుపతికి చేరుకున్నారు సీఎం జగన్. ఈ సందర్భంగా జగనన్న విద్యా దీవెన కార్యక్రమాన్ని ప్రారంబించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. ఫీజు రీఎంబర్స్ మెంట్ విషయంలో వైఎస్సార్ ఒక అడుగు వేస్తే..ఆయన కుమారుడిగా తాను నాలుగు అడుగులు వేస్తున్నానన్నారు.పిల్లల ఫీజు కట్టలేక తల్లిదండ్రులు అప్పులు చేసేవారన్నారు. అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకునేవారన్నారు. ఈ కష్టాలన్నీ పాదయాత్రలో తాను చూశానని ఆ పరిస్థితి రాకూడదనే విద్యా దీవెన పథకాన్ని ప్రారంభించామన్నారు.
Breaking : ఆత్మహత్యలు చేసుకోవద్దనే – విద్యాదీవెన – సీఎం జగన్
Advertisement
తాజా వార్తలు
Advertisement