మేడ్చల్ కలెక్టరేట్ ను ప్రారంభించారు సీఎం కేసీఆర్. అనంతరం ఆయన మాట్లాడుతూ..మేడ్చల్ జిల్లా అవుతుందని ఎవరూ అనుకోలేదన్నారు. పరిపాలన ప్రజలకు ఎంత దగ్గరగా వస్తే..పనులు అంత త్వరగా అవుతాయన్నారు. పరిపాలనా సౌలభ్యం కోసమే కొత్త జిల్లాల ఏర్పాటు జరిగిందన్నారు.పరిపాలనా భవనాన్ని గొప్పగా నిర్మించుకున్నామన్నారు.కేవలం ఆరు నెలల వ్యవధిలో భవనాలు నిర్మించామని చెప్పారు కేసీఆర్. 11వేలకు పైగా క్రీడా ప్రాంగణాలు సిద్ధమవుతున్నాయన్నారు. మరో 10లక్షల కొత్త పెన్షన్లు ఇస్తున్నామని వెల్లడించారు సీఎం. అందరికీ కొత్త కార్డులు ఇస్తున్నామన్నారు. తెలంగాణలో కరెంటు కష్టాలు తీరిపోయాయని కేసీఆర్ చెప్పారు. తెలంగాణ ఏర్పాటు వల్లే ఇది సాధ్యమయిందన్నారు.
Breaking : మేడ్చల్ జిల్లా అవుతుందని ఎవరూ ఊహించలేదు- 10లక్షల కొత్త పెన్షన్లు ఇస్తున్నాం-సీఎం కేసీఆర్
Advertisement
తాజా వార్తలు
Advertisement