Thursday, November 21, 2024

Breaking : తిండిలేదు – ఇవే ఆఖ‌రి క్ష‌ణాలు అనిపిస్తోంది – ఉక్రెయిన్‌లో భారతీయ విద్యార్థి ఆవేద‌న‌

ఉక్రెయిన్‌లో రష్యాలో యుద్ధం త‌లెత్త‌డంతో , భార‌తీయ విద్యార్థుల త‌ల్లి దండ్రులు ఆందోళ‌న‌కి గుర‌వుతున్నారు. కాగా ఆగ్రాలోని బమ్రౌలీ కటారాకు చెందిన దేవేంద్ర సింగ్ అనే విద్యార్థి ఉక్రెయిన్ నుంచి ఓ వీడియో పంపాడు. ప్రస్తుతం దేవేంద్ర సింగ్ ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయాడు. ఇక్కడ పరిస్థితి మరింత దిగజారిందని, ఇప్పటి వరకు అనేక ఫారాలు నింపామని, కానీ సమాధానం ఇవ్వలేదన్నారు. ఆహారం కూడా సరిపోవ‌ట్లేద‌ని…మరింత ఎక్కువ నీటిని ఆదా చేసేందుకు కప్పులు, గిన్నెలలో నింపుతున్నట్లు చెప్పారు. ఏ సమయంలోనైనా విద్యుత్-నీటి సరఫరా నిలిచిపోవచ్చు. ఐదు నిమిషాల క్రితం తన తలపై నుంచి రెండు ఫైటర్ జెట్‌లు వెళ్లాయని, అదే తన జీవితంలో చివరి క్షణంలా అనిపించిందని వీడియోలో ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. ఆ వీడియో చూసిన అత‌ని కుటుంబ‌స‌భ్యులు క‌న్నీరు మున్నీరుగా విల‌పిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement