జూబ్లీహిల్స్ కారు ప్రమాదం కేసులో కొత్త కోణం చోటు చేసుకుంది. నిన్న యాక్సిడెంట్ జరిగిన కారు నా కజిన్ ది అని ఎమ్మెల్యే తెలిపారు. ఆ కారుని తాను కూడా అప్పుడప్పుడు వాడతానని మీడియాకి వివరించారు. ప్రమాద ఘటన తెలియగానే నా కజిన్ మీర్జాతో మాట్లాడానన్నారు షకీల్. ఆ కారు నడిపింది నా కజిన్ మీర్జా కొడుకని తెలిపారు. కాగా ఈ యాక్సిడెంట్ లో ఎమ్మెల్యే షకీల్ కొడుకు రోహెల్ పేరు తెరపైకి వచ్చింది ..కారు నడిపింది డ్రైవరా..రోహెలా అనే సందిగ్థతలో ఉన్నారు పోలీసులు. ప్రమాదం జరిగి, ఓ పసిపాప ప్రాణంపోయి 16గంటలు అయింది. ఇప్పటికి కారు మాత్రమే పోలీసులు అదుపులో ఉంది. కారుకు సంబంధించి ఏ ఒక్కర్నీ విచారించలేదు పోలీసులు. కేసును తొక్కిపటట్టేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిందితుడ్ని పట్టించినా పోలీసులు వదిలేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. నిజామాబాద్ లో మహీంద్రా థార్ కొన్నాడు షకీల్.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..