Friday, November 22, 2024

Breaking : ఆదివాసీ జ‌నాల‌ను ఎప్పుడూ కామెంట్ చేయ‌లేదు – చిన్న జీయ‌ర్ స్వామి

చిన్న జీయ‌ర్ స్వామి మీడియా ముందుకు వ‌చ్చారు. విజ‌య‌వాడ‌లో ఆయ‌న మాట్లాడారు. ఈమ‌ధ్య కొన్ని వివాదాలు త‌లెత్తాయ‌న్నారు. అది స‌బ‌బా కాదా అనేది వినే వాళ్ల‌కే వ‌దిలేస్తున్నాం..ఆదివాసీ జ‌నాల‌ను మేం ఎప్పుడూ కామెంట్ చేయ‌లేద‌న్నారు. ఎప్పుడో 20ఏళ్ల కింద అన్న మాట‌ల‌పై ఇప్పుడు వివాదం రేపార‌ని చిన్న జీయ‌ర్ స్వామి అన్నారు. ఈ మ‌ధ్య కాలంలో అలాంటివి చెప్ప‌లేద‌న్నారు. ఆదిలాబాద్ అట‌వీ ప్రాంతంలోనూ స్కూళ్లు క‌ట్టించాం అన్నారు. కొంత‌మంది దేవ‌త‌ల‌ను చిన్న‌చూపు చూశామ‌న‌డం నిజం కాద‌న్నారు. పూర్వాప‌రాలు చూడ‌కుండా మ‌ధ్య‌లో కొన్ని అంశాల‌ను పిక‌ప్ చేయ‌డం క‌రెక్ట్ కాద‌న్నారు. మ‌హిళ‌ల‌ని కించ‌ప‌రిచేలా ఎప్పుడూ మాట్లాడ‌లేద‌న్నారు. మ‌హిళ‌లు ఆరోగ్యంగా ఉంటేనే స‌మాజం అని తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement