Saturday, November 23, 2024

Breaking : నీట్ పీజీ ప‌రీక్ష వాయిదా – కేంద్రం ప్రభుత్వం కీల‌క నిర్ణ‌యం

ఢిల్లీ నీట్ పీజీ ప‌రీక్ష‌ని కేంద్రం వాయిదా వేసింది. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్(నీట్)-2022 పీజీ పరీక్షను వాయిదా వేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 6 నుంచి 8 వారాల పాటు ఎగ్జామ్ ను పోస్ట్ పోన్ చేస్తున్నట్లు వెల్ల‌డించింది. అయితే షెడ్యూల్ ప్రకారం మార్చి 12 నిర్వహించాలని నిర్ణయించగా.. ప్రస్తుతం దీన్ని వాయిదా వేశారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఇంటర్న్ షిప్ కు సంబంధించి ఓ కేసు విచారణలో ఉంది. పీజీ పరీక్ష వాయిదా… ఇంటర్న్ షిప్ కు సంబంధించి విచారణ ముందుగా సుప్రీం కోర్టులో ఫిబ్రవరి 7న విచారించాల్సి ఉంది.

అయితే దీన్ని ఈరోజున విచారించేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది. దీంతో ఈ అంశం విచారణకు రాకముందే కేంద్రం నీట్ పీజీ ఎగ్జామ్ ను వాయిదా వేసింది. కరోనా కారణంగా వందలాది మంది ఎంబీబీఎస్ విద్యార్థులు తమ ఇంటర్న్ షిప్ ను పూర్తి చేయలేకపోయారు. దీంతో మార్చి 12న పీజీ పరీక్షకు ఇంటర్న్ షిప్ పూర్తి చేయని వారు అనర్హులు. ఈ నేపథ్యంలో పరీక్షను వాయిదా వేయాలని ఆరుగురు విద్యార్థులు ఈ అంశంపై సుప్రీం ను ఆశ్రయించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement