ప్రభ : రైతు దీక్ష వేదికగా మరోమారు తెరాస మానుకోట వర్గ పోరు బహిర్గతం అయ్యింది. తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మానుకోట కేంద్రంలో టీఆరెస్ జిల్లా అధ్యక్షురాలు, మానుకోట ఎంపీ మాలోత్ కవిత ఆధ్వర్యంలో రైతు నిరసన దీక్ష చేపట్టారు. ఇదే వేధికగా ఎమ్మెల్యే శంకర్ నాయక్ తన అక్కసును వెళ్లగక్కినట్లు తెలుస్తోంది. మొదటినుంచి ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే గా ఉన్న మానుకోట తెరాస రాజకీయాల్లో.. ఎంపీ మాలోత్ కవితను జిల్లా అధ్యక్షురాలు చేశాక మరింత ఎక్కువైనట్లు తెలుస్తోంది. ఇన్ని రోజులు నీవురు గప్పిన విధంగా మనసులో ఉంచుకున్న ఎమ్మెల్యే శంకర్ రైతు దీక్ష సాక్షిగా తన అయిష్టతను జిల్లా అధ్యక్షురాలు కవిత మాట్లాడుతుండగా… నేను మాట్లాడాలి అని మైకు లాక్కున్నారు.. తాను మాట్లాడాలి అంటున్నా వినకుండా ఎంపీ నుంచి మైకు లాక్కోవడంతో అక్కడవున్న వారు ఒక్కసారిగా ఆశర్యానికి లోనైయ్యారు.. కాసేపు ఏం జరుగుతోంది.. అర్థం కాని పరిస్థితి. కానీ ఎమ్మెల్యే ప్రవర్తన జిల్లా అధ్యక్షురాలు అభిమానులకు ఆగ్రహం తెప్పించింది.. ఆ సమయంలో అక్కడే ఉన్న కవిత తండ్రి.. డోర్నకల్ సీనియర్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ పార్టీపై గౌరవం.. కేసీఆర్, కేటీఆర్ రైతు దీక్ష పిలుపును గౌరవిస్తూ సంయమనం పాటించారు.
Breaking : ఎంపీ మాలోత్ కవిత మాట్లాడుతుండగా – మైక్ లాక్కొన్న ఎమ్మెల్యే
Advertisement
తాజా వార్తలు
Advertisement