రైతు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోదీ చేసిన ప్రకటన అభినందనీయమని బిజెపి నేత లంకా దినకర్ అన్నారు. రైతులకున్న అపోహల మధ్య చట్టాలు అమలు చేయడం వల్ల ప్రయోజనం లేదన్నారు. చట్టాలు మంచివైనా ఆ చట్టాల పరిధిలోని వారికి అనుమానాలు ఉన్నప్పుడు వారి భావాలు గౌరవించడం పాలకుల బాధ్యత అన్నారు. ఇదే బాధ్యతని అమరావతి రైతుల విషయంలో సీఎం జగన్ వ్యవహరించాలని తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement