ఢిల్లీ వ్యవసాయ చట్టాల రద్దు ప్రక్రియను ప్రారంభించింది కేంద్రం. వ్యవసాయ చట్టాలు వెనక్కి తీసుకుంటున్నామని ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. ఈ మేరకు ఈ నెల 24న కేంద్ర మంత్రివర్గం భేటీ కానుంది. మంత్రివర్గ భేటీలో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ నెల 29నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో మూడు బిల్లులు వెనక్కి తీసుకునే ప్రక్రియకు కేబినెట్ తీర్మానంతో ఆరంభం కానుంది. పార్లమెంట్ లో మూడు చట్టాలు రద్దయ్యే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటించింది. ఢిల్లీ సరిహద్దుల్లో ఈ నెల 26న తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీలు యథాతథమని సంయుక్త కిసాన్ మోర్చా తెలిపింది. అన్ని రాష్ట్రాల రాజధానుల్లో ట్రాక్టర్ ర్యాలీలు జరుగుతాయని వెల్లడించింది. చట్టాల రద్దుపై పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రక్రియ పూర్తి చేస్తామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
Breaking : వ్యవసాయ చట్టాల రద్దు ప్రక్రియ ప్రారంభం..పార్లమెంట్ సమావేశాల్లో నిర్ణయం
Advertisement
తాజా వార్తలు
Advertisement