బీజేపీ నేతలు ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారని మంత్రి కేటీఆర్ అన్నారు. సిలిండర్లపై రూ.లక్ష కోట్ల సబ్సిడీ ఎత్తి వేశారన్నారు. పెట్రోల్,డీజిల్ ధర పెంపుతో ప్రతి ఒక్కరు ఇబ్బందిపడుతున్నారన్నారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధానికి..ధరల పెంపుకి సంబంధం ఉందా అని నిలదీశారు.గ్యాస్ సిలిండర్ ధర వెయ్యి రూపాయలు దాటిందన్నారు. ధన్యాని కొనేవరకు కొట్లాటే అన్నారు. చాయ్ పే చర్చ అని చెప్పి ప్రధాని నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చారన్నారు. రైతులు రోడ్డెక్కడానికి కారణం ఎవరని నిలదీశారు కేటీఆర్. దేశమంతటా రైతుల కష్టాలపైనే చర్చ నడుస్తోందన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని మోడీ హామీ ఇచ్చారన్నారు. పార్లమెంట్ లో ధాన్యంపై చర్చ జరుగుతోందన్నారు మంత్రి కేటీఆర్.సిలిండర్ వెయ్యి అయ్యింది..మనకు కట్టెల పొయ్యి దిక్కయ్యింది. అప్పట్లో కాంగ్రెస్ దిగిపోవాలని ..బిజెపి ఆందోళనలు చేసిందని గుర్తు చేశారు. మరి ఇప్పుడు బీజేపీ నేతలు ఏం చేస్తారని ప్రశ్నించారు. పెట్రోల్ , డీజిల్ ధర పెంపు ఎవరి చేతికాని తనం అని అన్నారు. బీజేపీ నేతలు ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారన్నారు.
Breaking : సిలిండర్ రూ.వెయ్యి అయ్యింది..మనకు కట్టెల పొయ్యి దిక్కయ్యింది – మంత్రి కేటీఆర్
Advertisement
తాజా వార్తలు
Advertisement