మెగాస్టార్ చిరంజీవి సెన్సేషనల్ కామెంట్స్ ని చేశారు. అవసరానికి అండగా ఉంటా.. అనవసర పంచాయితీలు తనకి వద్దని చెప్పారు. ఆ పదవి తనకి వద్దని, పంచాయితీలు తాను చేయలేనన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇండస్ట్రీ పెద్ద అని అనిపించుకోవడం తనకి ఇష్టం లేదన్నారు. ఇద్దరు కొట్టుకుంటుంటే తాను ముందుకు రానన్నారు. కానీ సినిమా కార్మికులకు ఏ సమస్య వచ్చినా ముందుంటానని చెప్పారు చిరంజీవి. కార్మికుల కోసం తాను ఏదో ఒకటి చేస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. బాధ్యతగా ఉంటానని, సమస్యలు వస్తే సాయం చేస్తా అన్నారు. సినీ ఇండస్ట్రీకి పెద్దన్నయ్యగా నిలుస్తురానుకున్న వారి ఆశలపై నీళ్ళు చల్లినట్లయింది చిరంజీవి వ్యాఖ్యలతో. మరి ఇండస్ట్రీ పెద్దగా ఎవరు ఉంటారనేదానిపై సస్పెన్స్ నెలకొంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..