హైదరాబాద్ అసెంబ్లీ కమిటీ హాల్లో వాణిజ్యశాఖ పార్లమెంటరీ స్థాయి సంఘం సమావేశమయింది. ఈ మీటింగ్ ఎంపీ విజయసాయిరెడ్డి నేతృత్వంలో జరిగింది. కాగా ఈ మీటింగ్ లో తెలంగాణ, ఏపీ అధికారులు, వాణిజ్య రంగ ప్రతినిధులు పాల్గొంటున్నారు. తెలంగాణ నుంచి మంత్రి కేటీఆర్, సీఎస్ సోమేశ్ కుమార్, ఎంపీలు నామా నాగేశ్వరరావు, డి.శ్రీనివాస్, ధర్మపురి అర్వింద్ హాజరయ్యారు. ఏపీ నుంచి మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఫిక్కి, ఎస్బీఐ, ఫార్మా రంగ ప్రతినిధులు, పలువురు అధికారులు, తదితరులు పాల్గొన్నారు. ఈ-కామర్స్ రంగానికి ప్రోత్సాహం, నియంత్రణ వంటి అంశాలపై చర్చిస్తున్నారు.
Breaking : ఎంపీ విజయసాయిరెడ్డి నేతృత్వంలో మీటింగ్ – హాజరయిన మంత్రి కేటీఆర్
Advertisement
తాజా వార్తలు
Advertisement