జనగామలో సీఎం కేసీఆర్ బహిరంగ సభని నిర్వహించారు. ఈ సభకి టీఆర్ ఎస్ శ్రేణులు భారీగా తరలివచ్చారు. జనగామ జిల్లా ప్రజలు, అధికారులకు , అభినందనలు తెలిపారు కేసీఆర్. గతంలో జనగామ ప్రాంతాన్ని చూస్తే కళ్లల్లో నీళ్లు వచ్చేవని అన్నారు. బచ్చన్నపేటలో బతుకులు బాగుపడుతున్నాయన్నారు. ఎన్నడూ పండనటువంటి పంటలు పండుతున్నాయన్నారు. గోదావరి నీళ్లతో జనగామ పాదాలు కడిగేందుకు రంగం సిద్ధమయిందన్నారు. జగామకు మెడికల్ కాలేజీని మంజూరు చేస్తామన్నారు. పాలకుర్తికి మెడికల్ కాలేజ్ మంజూరు చేస్తామన్నారు. పాలకుర్తిలో డిగ్రీ కాలేజీని ఏర్పాట్లు చేస్తామన్నారు. జనగామ ఒకప్పుడు కరువుసీమగా ఉండేదన్నారు. టీఆర్ ఎస్ అధికారంలోకి వచ్చాక పరిస్థితి మారిందన్నారు. ఈ ఏడాది 40వేల కుటుంబాలకు దళితబంధు..రాబోయే రెండు, మూడు రోజుల్లో జీవో ఇస్తామన్నారు సీఎం కేసీఆర్. మార్చి తర్వాత ప్రతినియోజకవర్గంలో రెండు వేల కుటుంబాలకు దళితబంధువుని ఇస్తామన్నారు. వచ్చే ఏడాదిలోగా అన్ని చెరువులు నింపుతామన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..