Tuesday, November 26, 2024

Breaking : అగ్ర‌వ‌ర్ణాల్లోని పేద‌లు కూడా మావాళ్లే – జీవ‌నోపాధి కోల్పోయిన వారి కోసం రూ.108కోట్లు-సీఎం జ‌గ‌న్

మ‌త్య్స‌కార భ‌రోసా కార్య‌క్ర‌మ‌లో పాల్గొన్నారు సీఎం జ‌గ‌న్. వ‌రుస‌గా నాలుగో ఏడాది మ‌త్స్య‌కార భ‌రోసా కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మం కోన‌సీమ జిల్లా ముర‌మ‌ళ్ల‌లో జ‌రిగింది. రూ.109కోట్లు జ‌మ చేయ‌నుంది ప్ర‌భుత్వం.ఓఎన్జీసీ పైపులైన్ కార‌ణంగా జీవ‌నోపాధి కోల్పోయిన 23,458మంది మ‌త్య్స‌కార కుటుంబాల‌కు రూ.108కోట్లు జ‌మ చేయ‌నున్నారు. ఈ మేర‌కు సీఎం జ‌గ‌న్ మాట నిల‌బెట్టుకున్నారు.ఒక్క బ‌ట‌న్ నొక్క‌గానే న‌గ‌దు జ‌మ అవుతుంద‌న్నారు జ‌గ‌న్. వేట నిషేధ స‌మ‌యంలో రూ.10వేలు చొప్పున ఆర్థిక స‌హాయం చేస్తామ‌న్నారు. రూఐ.109కోట్లు ఇందుకు ఖ‌ర్చు చేస్తున్నాం అన్నారు. ఇక నెల‌కు రూ.11వేల 500చొప్పున ఐదు నెల‌ల‌పాటు ఆర్థిక‌సాయం అందిస్తామ‌న్నారు.నేడు రూ.217కోట్లు మ‌త్స్య‌కారుల‌కు అంద‌జేస్తాం అన్నారు. అగ్ర‌వ‌ర్ణాల్లోని పేద‌లు కూడా మావాళ్లే అన్నారు జ‌గ‌న్.

Advertisement

తాజా వార్తలు

Advertisement