షార్ట్ సర్య్కూట్ కారణంగా కూరగాయల మార్కెట్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 24దుకాణాలు దగ్థమయ్యాయి. ఈ సంఘటన మధ్యప్రదేశ్లోని మొరెనా జిల్లాలోని కైలారస్ మండిలో చోటు చేసుకుంది. అగ్నిమాపక శాఖ సిబ్బంది రెండు గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చాయి. మంటలు చెలరేగడంతో వ్యాపారస్థులు భయాందోళనలకి గురయ్యారు. తక్షణం వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు నాలుగు ఫైర్ ఇంజన్లను ఉపయోగించారు. దీంతో మంటలు అదుపులోకి వచ్చాయి. లక్షల రూపాయల నష్టం వాటిల్లినట్లు సమాచారం.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..