ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకి ఢిల్లీ హైకోర్టు బెయిల్ నిరాకరించింది. మద్యం కుంభకోణం కేసులో మనీశ్ సిసోడియా అరెస్టయిన సంగతి తెలిసిందే. జస్టిస్ దీనేశ్ కుమార్ శర్మ నేతృత్వంలోని సింగిల్ బెంచ్ బెయిల్ పిటీషన్‌ను తిరస్కరించింది. మనీశ్ సిసోడియాపై వచ్చిన ఆరోపణలు తీవ్రంగా ఉన్నట్లు కోర్టు పేర్కొంది. అయితే బెయిల్ ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించడంతో.. సిసోడియా సుప్రీంకోర్టను ఆశ్రయించనున్నట్లు సమాచారం. సిసోడియా ఓ ప్రభావవంతమైన వ్యక్తి అని, సాక్షులను ఆయన ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయని, అందుకే బెయిల్‌ను తిరస్కరిస్తున్నట్లు ఢిల్లీ హైకోర్టు తెలిపింది. జూన్ ఒకటో తేదీ వరకు సిసోడియా జుడిషియల్ కస్టడీని పొడిగిస్తున్నట్లు ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు తెలిపింది. సిసోడియాకు ఓ చెయిర్‌తో పాటు పుస్తకాలను ఇవ్వాలని జైలు అధికారులను కోర్టు ఆదేశించింది. లిక్కర్ పాలసీ కేసులో సీబీఐ, ఈడీలు సిసోడియాను విచారిస్తున్న విషయం తెలిసిందే.
Advertisement
తాజా వార్తలు
Advertisement