హైదరాబాద్‌లోని మణికొండ అంటే బడా వ్యాపార వేత్తలు, సంపన్నులు, సినీ తారలు నివాసముండే ఏరియా. అది సిటీలోని ఓ రిచ్ ఏరియాగా అందరికీ పరిచయం. కానీ ఇప్పుడక్కడ రోడ్ల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. జీహెచ్ ఎంసీ ఆఫీసర్లు కానీ, హెచ్ఎండీఏ కానీ సమస్యలకు పరిష్కారం చూపడం లేదు.
అయితే మున్సిపల్ పరిపాలన ముఖ్యాధికారి అరవింద్‌కుమార్ ఈరోజు మణికొండ నుంచి ఓ ట్వీట్ వచ్చింది. మణికొండలో రోడ్ల పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. రోడ్ల మీదనే మురుగు నీరు పారుతోంది.. ఇప్పటికే ఓపెన్ ట్రెంచ్ ఓ సాఫ్ట్ వేర్ టెకీని బలిగొంది. దయచేసి వెంటనే పరిస్థితిన సమీక్షించి సమస్యను పరిష్కరించండి అని ఆ ట్విట్టర్లో పేర్కొన్నారు.
ఈ ట్వీట్‌కు వెంటనే రెస్సాండ్ అయ్యారు Chief Secretary, MA&UD & Director General అర్వింద్‌కుమార్. ఈ సమస్యను మణికొండ కమిషనర్ నోటీస్‌కు సెండ్ చేస్తున్నా.. త్వరలోనే మీ సమస్య పరిష్కారం అవుతుందని మాటిస్తున్నా అని రిప్లై ఇచ్చారు అర్వింద్‌కుమార్.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily