Tuesday, November 26, 2024

Breaking: ప్రపంచస్థాయి ప్రమాణాలతో మానేరు రివర్ ప్రంట్.. సీఎం కేసీఆర్ ఆదేశాలతో శ‌ర‌వేగంగా పనులు..

ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం మేరకు సర్వాంగ సుందరంగా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో రూపుదిద్దుకోబోతున్న కరీంనగర్ మానేరు రివర్ ప్రంట్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. వారంలో టెండర్లు పిలిచేందుకు అధికారులకు ఆదేశాలు జారీ చేసారు రాష్ట్ర బిసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్. పనుల్లో పురోగతి, డిజైన్ల పరిశీలన, క్షేత్ర స్థాయి పనులకు సంబందించి ఈరోజు ఇరిగేషన్, టూరిజం, డిజైనింగ్ కన్సల్టేన్సీ, జిల్లా ఉన్నతాధికారులతో జల సౌదలో మంత్రి గంగుల సమీక్ష సమావేశం నిర్వహించారు, మొదటినుండి మానేరు రివర్ ప్రంట్ పనుల్లో మంత్రి గంగుల చూపిస్తున్న చొరవతో అన్ని శాఖల్ని సమన్వయం చేసుకుంటూ రికార్డు స్థాయిలో ప్రాజెక్టును టెండర్ల దశకు తీసుకొచ్చారు మంత్రి గంగుల. గత సమీక్ష అనంతరం జరిగిన పనుల పురోగతిని అధికారులు, సర్వే సంస్థల ప్రతినిధులు మంత్రికి వివరించారు.

మానేరు రివర్ ప్రంట్లో ప్రధాన బాగాలైన బారేజ్, లోయర్ ప్రామినాడ్, అప్పర్ ప్రామినాడ్లకు సంబందించిన డీపీఆర్ల్ని అధికారులు మంత్రికి వివరించారు, ప్రాజెక్టుపై క్షుణ్నంగా సమీక్షించిన మంత్రి గంగుల పనులు వేగంగా పూర్తి చేసేలా అధికారులకు ఆదేశాలు జారీ చేసారు, గత వందేళ్ల నీటి విడుదల పరిమాణం ఆదారంగా 80వేల క్యూసెక్కులు మొదలు 3లక్షల 50వేల క్యూసెక్కుల వరకూ నీటి విడుదల సమయాల్లో రివర్ ప్రంట్ నిర్మాణం పటిష్టంగా ఉండేదుకు రూపొందించిన డిజైన్లపై మంత్రి సమీక్షించారు, దాదాపు 4 కిలోమేటర్ల మేర వివిద దశలుగా రూపొందే రిటైనింగ్ వాల్ లోయర్, అప్పర్ ప్రామినాడ్లు, బారేజీ డీపీఆర్ పైనలైనందున టెండర్లు పిలవాల్సింగా ఆదేశించారు,

ఇప్పటికే 410 కోట్లని ప్రభుత్వం కేటాయించిందని, స్వయంగా ముఖ్యమంత్రిగారే అసెంబ్లీలో ఈ ప్రాజెక్టు గురించి ప్రకటించారన్నారు మంత్రి గంగుల. ప్రపంచ స్థాయి నిర్మాణాలతో మానేరు రివర్ ప్రంట్ రూపుదిద్దుకోబోతుందని, దీనికి సంబందించిన పూర్తి పేపర్ వర్క్, గ్రౌండ్ వర్క్ పూర్తయిందని, డిజైన్లపై సంత్రుప్తి వ్యక్తం చేసారు. ఈ నెలలోనే టెండర్లను పిలిచి వచ్చేనెల నుండే పనులను ప్రారంభిస్తామన్నారు మంత్రి గంగుల.

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మానేరు రివర్ ఫ్రంట్ నిర్మాణానికి నిధుల కొరత లేదన్నారు. ప్రాజెక్టులో బోటింగ్, అమ్యూజ్ మెంట్ పార్కులు, వాటర్ స్పోర్ట్స్, పౌంటేన్లు, ఆడిటోరియం, మ్యూజియం, కిడ్స్ ప్లే ఏరియాలు, సీనియర్ సిటిజన్ గార్డెన్స్, ప్లవర్ గార్డెన్లు, రాక్ గార్డెన్లు, లేజర్ షోలు, విశాలమైన లాండ్ స్కేపింగులు, ఇంకా స్పోర్ట్ ఎన్ క్లేవ్లో బాగంగా టెన్నిస్, వాలిబాల్ ఇతర స్పోర్ట్స్ కోర్టులు, ప్రాజెక్టు పొడవునా వాకింగ్, జాగింగ్ ట్రాకులతో దక్షిణ భారతానికే తలమానికంగా, కరీంనగర్ని ప్రపంచ పటంలో ప్రత్యేకంగా నిలిపేలా మానేరు రివర్ ప్రంట్ రూపొందబోతుందన్నారు మంత్రి గంగుల. అభివ్రుద్ది పనులను జోన్ల వారిగా విభజించి ఏక కాలంలో సివిల్ వర్కులతో పాటు టూరిజం ఇతర పనులను కూడా పూర్తి చేయబోతున్నామన్నారు.

ఇప్పటికే ప్రాజెక్టులో అంతర్బాగంగా నిర్మించిన తీగల వంతెన నిర్మాణం ఇప్పటికే పూర్తైంది, రివర్ బెడ్ నిర్మాణం, ప్రపంచ స్థాయి సౌకర్యాలతో హాస్పిటాలిటీ ఏర్పాట్లు, చిల్డ్రన్ పార్క్స్, వాటర్ పౌంటేన్స్, బోటింగ్, వాకింగ్, సైక్లింగ్ ట్రాక్ ఇతర ఏర్పాట్లపై ఈ సమావేశంలో చర్చించారు. కార్యక్రమంలో ఇరిగేషన్ ఈఎన్సీలు మురళీధర్, శంకర్, టూరిజం శాఖ ఈడి శంకర్ రెడ్డి, టీఎస్ టీడీసీ సీఈ వెంకటరమణ, ఇరిగేషన్ ఎస్ఈ శివకుమార్, ఐఎన్ఐ కన్సల్టేన్సీ డైరెక్టర్ హర్ష్ గోయల్,ఇతర రాష్ట్ర, కరీంనగర్ జిల్లా ఇరిగేషన్, టూరిజం, రెవెన్యూ, మున్సిపల్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement