జమ్ముకశ్మీర్ బారాముల్లాలో ఎదురు కాల్పులు జరిగాయి. ఉగ్రవాదుల కాల్పుల్లో ముగ్గురు జవాన్లకు గాయాలయ్యాయి. కాగా ఎదురు కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. బారాముల్లాలోని వాల్వా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో బుద్గాం పోలీసులు, భద్రతా దళాలు గురువారం తెల్లవారుజామున గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో గాలింపు బృందాలపై టెర్రరిస్టులు కాల్పులు జరిపారని కశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ చెప్పారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ముగ్గురు జవాన్లు గాయపడ్డారని, వారిని ఆసుపత్రికి తరలించామని తెలిపారు. ప్రస్తుతం వారి పరిస్థితి బాగానే ఉందన్నారు. ఆ ప్రాంతంలో ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నదని వెల్లడించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement