Monday, November 18, 2024

Breaking: మ‌ల్ల‌న్న‌కు బెయిలొచ్చింది.. మ‌ల్లేమైత‌దో అన్న టెన్ష‌న్ వీడ‌లే!

జ‌ర్న‌లిస్టు తీన్మార్‌ మల్లన్న (చింతపండు నవీన్‌)కు ఎట్ట‌కేల‌కు బెయిల్ లభించింది. దాదాపు రెండు నెలల నుంచి ఆయన జైల్‌ రిమాండ్‌లో ఉన్నారు. కల్లు వ్యాపారిని బెదిరించి డబ్బులు వసూలు చేశార‌న్న ఆరోప‌ణ‌ల‌తో పాటు మల్లన్నపై ప‌లు కేసులు న‌మోద‌య్యాయి. హైదరాబాద్‌ చిలకలగూడతో పాటు రాష్ట్రంలోని ప‌లు పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల్లో అత‌డిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

అప్ప‌టి నుంచి జైలులోనే ఉంటున్నారు తీన్మార్ మ‌ల్ల‌న్న‌. బెయిల్ కోసం ఇంత‌కు ముందు చేసిన ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌లేదు. కాగా ఇటీవ‌ల దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు ఈ రోజు బెయిల్‌ మంజూరు చేసింది.

అయితే తన భర్తపై అక్రమ కేసులు పెట్టార‌ని ఫిర్యాదు చేస్తూ, మల్లన్న భార్య ఇటీవల కేంద్ర‌ హోంమంత్రి అమిత్ షాను కూడా కలిశారు. జాతీయ బీసీ కమిషన్ కూడా కేసుల విషయంలో ఆగ్రహం వ్యక్తం చేసింది. టీఆర్ఎస్ ప్ర‌భుత్వం క‌క్ష సాధింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతోంద‌ని బీజేపీ తెలంగాణ నేత‌లు మండిప‌డ్డారు. బెయిలు వ‌చ్చిన‌ప్ప‌టికీ మ‌ళ్లీ పోలీసులు ఇంకేం కేసు పేరు చెప్పి అరెస్టు చేస్తారోన‌ని సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు ప్ర‌శ్నిస్తున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement