Thursday, November 21, 2024

Breaking: మహారాష్ట్ర ఫుల్ కండిషన్స్‌.. రెండు డోసుల వ్యాక్సిన్, ఆర్‌టీపీసీఆర్ టెస్ట్ మ‌స్ట్..

కరోనా కొత్త వేరియంట్ నేప‌థ్యంలో మ‌హార‌ష్ట్ర ప్ర‌భుత్వం ప‌లు ఆంక్ష‌లు పెట్టింది. రాష్ట్రంలోకి వ‌చ్చే ప్రయాణికులు ఎవ‌రైనా స‌రే రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకుని ఉండాల‌ని కండిష‌న్ పెట్టింది ప్ర‌భుత్వం. అంతేకాకుండా 72 గంట‌ల ముందు ఆర్‌టీపీసీఆర్ టెస్ట్ మ‌స్ట్ గా ఉండాల‌ని తెలిపింది. కాగా, దక్షిణాఫ్రికాతో పాటు పలు దేశాల్లో కలకలం సృష్టిస్తున్న కొవిడ్ కొత్త వేరియంట్‌పై తెలంగాణ ప్ర‌భుత్వం కూడా అప్ర‌మ‌త్తం అయ్యింది.

ఈ నేప‌థ్యంలో ఈ నెల 28న వైద్యారోగ్య శాఖ అధికారుల‌తో మంత్రి హ‌రీశ్‌రావు భేటీ కానున్నారు. క‌రోనా కొత్త వేరియంట్ విజృంభిస్తున్న నేప‌థ్యంలో అంత‌ర్జాతీయ ప్ర‌యాణికుల విష‌యంలో తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై చ‌ర్చించ‌నున్నారు. కొత్త వేరియంట్‌ వ్యాపిస్తున్న దేశాల నుంచి వచ్చే వారి విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించనున్నారు. ఇదే అంశంపై ఇటీవల కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేసిన విషయం తెలిసిందే. అంత‌ర్జాతీయ ప్ర‌యాణికుల ట్రేసింగ్, టెస్టింగ్‌పై మంత్రి హ‌రీశ్‌రావు వైద్యారోగ్య శాఖ అధికారుల‌తో చ‌ర్చించి, ప‌లు సూచ‌న‌లు చేయ‌నున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసంఫేస్‌బుక్‌,  ట్విట్టర్   పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement