అన్ని అంశాలపై ఏకాభిప్రాయానికి వచ్చామని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే అన్నారు. నేడు ఆయనని తెలంగాణ సీఎం కేసీఆర్ కలిశారు. ఈ సందర్భంగా థాక్రే మీడియాతో మాట్లాడారు.. మహారాష్ట్ర , తెలంగాణ సోదర రాష్ట్రాలని చెప్పారు. ఈ రెండు రాష్ట్రాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. మా మీటింగ్ తో నేడు తొలి అడుగుపడిందన్నారు.మేం చాలాకాలం నుంచి కలవాలని అనుకున్నామని చెప్పారు. మా హిందుత్వం..ప్రతీకారం తీర్చుకోవడం కాదని తెలిపారు ఉద్ధవ్ థాక్రే. ఇలాంటి స్థితిలో దేశ భవిష్యత్తు ఏంటి..ఎవరైనా చొరవ తీసుకోవాలని చెప్పారు. అందుకే మేం చొరవ తీసుకున్నామన్నారు.
Breaking : మహారాష్ట్ర , తెలంగాణ సోదర రాష్ట్రాలు – సీఎం ఉద్ధవ్ థాక్రే
Advertisement
తాజా వార్తలు
Advertisement