మధ్యప్రదేశ్ , హిమాచల్ ప్రదేశ్ లో ఆదివారం ఫస్ట్ ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. మధ్యప్రదేశ్ లో విదేశాల నుంచి వచ్చిన ఎనిమిది మందికి పాజిటీవ్ గా నిర్థారణ అయింది. కాగా హిమాచల్ ప్రదేశ్ లో జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపిన తొమ్మిది నమూనాలలో ఒకరికి ఒమిక్రాన్ గా నిర్థారణ అయింది. మధ్యప్రదేశ్ లో ఎనిమిది కేసులలో, మూడు యూనైటెడ్ స్టేట్స్ నుండి, రెండు యునైటెడ్ కింగ్‌డమ్ , టాంజానియా నుండి ఒకటి, ఘనా నుండి తిరిగి వచ్చారు. ఈ టెస్ట్ లో ఆరుగురికి నెగెటివ్ రావడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. మిగిలిన ఇద్దరిలో పెద్దగా లక్షణాలు కనిపించలేదు.హిమాచల్ ప్రదేశ్‌లో, కెనడా నుండి తిరిగి వచ్చిన మహిళకు పాజిటివ్ పరీక్షించారు. ఆమె నెగెటివ్ RT-PCR పరీక్ష రిపోర్ట్స్ వచ్చాయి. ఆమెతో పరిచయం ఉన్న ముగ్గురుకి కోవిడ్ లక్షణాలు కనిపించాయి.కాగా వారి శాంపిల్స్ నుండి ఫలితాలు రావాల్సి ఉంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..