DRDO కింద పనిచేస్తున్న Combat Vehicles Research and Development Establishment (పోరాట వాహనాల పరిశోధన, అభివృద్ధి సంస్థ) ఇటీవల మానవరహిత వైమానిక వాహనం TAPAS కోసం ముడుచుకునే ల్యాండింగ్ గేర్ వ్యవస్థను అభివృద్ధి చేసింది. ఈ ల్యాండింగ్ గేర్ వ్యవస్థను భారత నావికాదళం ఉపయోగించనుంది.
ఈ రోజు దీన్ని సక్సెస్ ఫుల్ గా ట్రయల్ రన్ చేసినట్టు పేర్కొంది డీఆడీవో. దీనికి సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు అధికారులు. దీంతో పాటు గగన్ శాటిలైట్ సిస్టమ్‌ను కూడా సక్సెస్ ఫుల్‌గా పరిశీలించినట్టు పేర్కొన్నారు. బెంగళూరులో ఈ రోజు దీన్ని విజయవంతంగా నిర్వహించినట్టు తెలుపుతూ దానికి సంబంధించిన వీడియోన్ ట్విట్టర్‌లో పెట్టారు.
ముడుచుకునే ల్యాండింగ్ గేర్ వ్యవస్థ అంటే ఏంటి?
ముడుచుకునే ల్యాండింగ్ గేర్ వ్యవస్థలో వీల్ మరియు బ్రేక్ సిస్టమ్‌తో అనుసంధానించిన హైడ్రోగాస్ షాక్ స్ట్రట్ ఉంటుంది. ఇది ల్యాండింగ్ సమయంలో విమానాన్ని కాపాడటానికి ఉపయోడపడుతుంది. ఇంపాక్ట్ లోడ్‌ను గ్రహిస్తుంది. ఇది హైడ్రాలిక్ ద్రవంతో కలిపి నత్రజనిని కలిగి ఉంటుంది. ఇది విమానం ల్యాండింగ్ టైమ్‌లో ఇంపాక్ట్ లోడ్‌ను గ్రహించి బయటకు వెదజల్లుతుంది. హైడ్రో-గ్యాస్ స్ట్రట్ డిజైన్‌లో ఇది కొత్తది. అయితే.. ల్యాండింగ్ గేర్ వ్యవస్థల ముఖ్య ఉద్దేశం మానవరహిత వైమానిక వాహనం సురక్షితంగా టేకాఫ్ మరియు ల్యాండింగ్ అవడం.
TAPAS UAV ఏంటి?
TAPAS అనేది Tactical Airborne Platform for Aerial Surveillance beyond horizon. దీనిని RUSTOM-2 అని కూడా అంటారు. అమెరికన్ ప్రిడేటర్ డ్రోన్స్ తరహాలో దీన్ని ఇండియా అభివృద్ధి చేసింది. TAPAS తొలి విమానం 2016లో అందుబాటులోకి వచ్చింది.
మానవరహిత వైమానిక వాహనాలు ఎందుకు అవసరం?
వేటాడి అటాక్ చేసే పనులకు ఇవి ముఖ్యమైనవి. 2050 నాటికి కనీసం 50% కాంబాట్ మిషన్లకు ఈ యూఏవీలనే వాడతారని అనకుంటున్నారు.
యూఏవీ టెక్నాలజీలో ఇండియా ఎక్కడ ఉంది?
యూఏవీలో ఇండియా ఇంకా స్టార్టింగ్ దశలోనే ఉంది. ఈ టెక్నాలజీలో ఇజ్రాయెల్, అమెరికా ముందున్నాయి. ఈ టెక్నాలజీని అభివృద్ధి చేయడానికి ఈ రెండు దేశాలతో ఇండియా ఒప్పందం చేసుకుంది. ఈ దేశాల నుంచి యూఏవీలను కొన్నది. హెరాన్ యూఏవీ విమానాలను ఇజ్రాయెల్ నుండి కొనుగోలు చేసింది. కంబాట్ సామర్థ్యమున్న మిషన్లను ఇండియా డెవలప్ చేయడానికి కనీసం రెండు దశాబ్దాలు పడుతుందని అంచనా.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily