మంత్రివర్గంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి చోటు దక్కలేదు. మంత్రి పదవి దక్కకపోవడంతో కన్నీరు పెట్టారు కోటంరెడ్డి. దాంతో ఆయన అనుచరులు కోపంతో ఊగిపోయారు. మీడియా ముందు కన్నీరు పర్యంతమైయ్యారు కోటంరెడ్డి..మంత్రి పదవిని ఆశించడం తప్పా అని ప్రశ్నించారు. పార్టీ కోసం కట్టుబడి పని చేశామన్నారు. సీఎం జగన్ ఏం నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉన్నా..పార్టీ కోసం పని చేశాను..నాకు బాధ మాత్రం ఉందన్నారు..అసంతృప్తితో తాను ఉన్నానని, మోసం, అబద్దాలు చెప్పడం తన నైజం కాదని అన్నారు. కడుపు మండుతోందన్నారు. మొదటి కేబినెట్ లోనే మంత్రి పదవిని ఆశించానన్నారు. జగన్ ఆదేశాలే శిరోధార్యమని భావించామన్నారు.కడుపులో ఒకటి..బయటికి ఒకటి మాట్లాడటం చేతకాదన్నారు. యుద్ధంలో సైనికుడు ..రాజు ప్రోత్సాహాన్ని ఆశిస్తారన్నారు. అసంతృప్తి ఉన్నా జగన్ కోసం పనిచేస్తామని తెలిపారు.
Breaking : అసంతృప్తి ఉన్నా – జగన్ కోసం పనిచేస్తా – మీడియా ముందు కన్నీరు పెట్టిన కోటంరెడ్డి
Advertisement
తాజా వార్తలు
Advertisement