ట్రక్కుని ఢీ కొంది ట్రాలీ..ఈ ఘటనలో నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదం కోట రాజస్థాన్ లో చోటు చేసుకుంది.
13 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. బటావ్డా గ్రామంలో ఓ వివాహానికి హాజరైన తర్వాత ట్రాక్టర్-ట్రాలీ సుమారు 18 మందిని హనువత్ఖేడా గ్రామంలోని వారి ఇళ్లకు తిరిగి తీసుకువెళుతోంది. వెనుక నుంచి 7-8 ట్రాక్టర్లతో వేగంగా వస్తున్న ట్రక్కు ట్రాక్టర్ ట్రాలీని ఢీకొట్టిందని బరన్ సదర్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ రాజేష్ ఖతానా తెలిపారు. హనువత్ఖేడా గ్రామస్తులు భూరిబాయి (65), చంద్రకళ (55), సుశీల (40), రామ్‌కరణ్ సైన్ (60) అక్కడికక్కడే మృతి చెందారు, మహిళలు .. పిల్లలు సహా 13 మంది గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన వారిలో ఇద్దరిని కోట ఆసుపత్రికి, మరో 11 మంది బారన్ ఆసుపత్రిలో చికిత్స పొందారని ఆయన చెప్పారు. పోలీసులు ట్రక్కు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేశారు.
మృతుల పట్ల రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ విచారం వ్యక్తం చేశారు .. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. గెహ్లాట్ ట్విటర్లో ఇలా పేర్కొన్నారు..మృతుల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.. ఈ క్లిష్ట సమయంలో దేవుడు వారికి శక్తిని ప్రసాదించాలన్నారు.. మరణించిన ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని తెలిపారు. రాష్ట్ర మైనింగ్ శాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే ప్రమోద్ జైన్ భాయా, బరన్ పోలీస్ సూపరింటెండెంట్ కళ్యాణమల్ మీనా, జిల్లా కలెక్టర్ నరేంద్ర గుప్తా ప్రమాద స్థలాన్ని, క్షతగాత్రులు చికిత్స పొందుతున్న ఆసుపత్రిని సందర్శించినట్లు SHO తెలిపారు.
Breaking : ట్రాలీని ఢీ కొన్న ట్రక్కు -నలుగురు మృతి
Advertisement
తాజా వార్తలు
Advertisement