కేరళ ప్రభుత్వంపై మరోసారి మండిపడ్డారు కేరళ గవర్నర్ . పలువురు మంత్రులు, ప్రజా ధనాన్ని వృధా చేస్తున్నారని గవర్నర్ ఆరీఫ్ మహ్మద్ ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమెన్ చాందీ, రమేష్ చెన్నితాల నుంచి నేర్చుకోవాలని విపక్ష నేతకు గవర్నర్ సూచించారు. ప్రతిపక్ష నేత వీడీ సతీశన్, ఏకే బాలన్‌లను గవర్నర్ మందలించారు. రాజ్‌భవన్‌ను నియంత్రించేందుకు ఎవరూ ప్రయత్నించవద్దని ఆయన అన్నారు. ఎకె బాలన్ చిన్నపిల్లాడిలా ప్రవర్తిస్తున్నారని అన్నారు. అలాగే ఊమెన్ చాందీ, రమేష్ చెన్నితాల నుంచి నేర్చుకోవాలని వీడీ సతీషన్‌కు సూచించారు. పలు అంశాలపై కేరళ గవర్నర్‌కు, ప్రభుత్వానికి మధ్య వాగ్వాదం జరిగింది. డిసెంబర్ 2021లో, కేరళ ప్రభుత్వంతో తనకు ఎలాంటి వివాదాలు లేవని గవర్నర్ ఖాన్ చెప్పారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..