కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తో తెలంగాణ మంత్రులు, ఎంపీలు భేటీ అయ్యారు. తెలంగాణ ధాన్యం సేకరణపై చర్చ జరిపారు. యాసంగి ధాన్యం పూర్తిగా కొనుగోలు చేయాలని వినతి చేశారు. యాసంగి ధాన్యం పూర్తిగా కొనుగోలు చేయాలని వినతి చేశారు. సీఎం కేసీఆర్ ది రైతు వ్యతిరేక ప్రభుత్వమని అన్నారు కేంద్రమంత్రి పీయూష్ గోయల్. రా రైస్ ఎంత ఇస్తామనే విషయం..ఇంతవరకు తెలంగాణ ప్రభుత్వం చెప్పలేదన్నారు. రైతులను అడ్డం పెట్టుకుని కేసీఆర్ రాజకీయం చేస్తున్నారన్నారు. అన్ని రాష్ట్రాల్లో సేకరిస్తున్నట్లుగానే తెలంగాణ నుంచి రారైస్ ని సేకరిస్తామన్నారు. గతంలో కంటే ఏడున్నర శాతం ధాన్యం సేకరించామన్నారు. అన్ని రాష్ట్రాల మాదిరిగానే తెలంగాణ నుంచి ముడి బియ్యం కొన్నామని తెలిపారు. తెలంగాణ తప్ప అన్ని రాష్ట్రాలు ముడి బియ్యం ఇస్తామని చెప్పాయని పీయూష్ వెల్లడించారు.
Breaking : రైతులను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తోన్న సీఎం ‘కేసీఆర్’ – పీయూష్ గోయల్
Advertisement
తాజా వార్తలు
Advertisement