Saturday, November 23, 2024

Breaking : బాలింత‌ల‌కు, గ‌ర్భిణుల‌కు కేసీఆర్ కిట్స్ – యోగ‌, క్షేమాలు అడిగిన మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏదో ఒక నినాదంతో చేసుకోవడం ఆనవాయితీ కాగా …ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని తెలంగాణలో మహిళా బంధు పేరుతో వేడుక‌లు చేసుకోవ‌డం .. మహిళల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి, భద్రత , పోషణ కార్యక్రమాలకు వారికి ఈ రాష్ట్ర మహిళలు ఇస్తున్న ఒక కానుక అని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఈనెల 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్రంలో 6, 7, 8 తేదీల్లో మహిళా దినోత్సవ సంబరాలు నిర్వహించాలని టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు నేడు మహబూబాబాద్ జిల్లా ఏరియా హాస్పిటల్లో మంత్రి సత్యవతి రాథోడ్ పర్యటించి, గత వారం రోజులుగా హాస్పిటల్లో ప్రసవించిన మహిళలకు కెసిఆర్ కిట్స్ అందించి, మహిళల కోసం ముఖ్యంగా బాలింతలు, గర్భిణుల కోసం ఈ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను వారికి వివరించారు. బాలింతలకు కెసిఆర్ కిట్స్ ఇచ్చి, అందులో ఉన్న వస్తువుల గురించి తెలియజెప్పారు. అనంతరం వారితో సెల్ఫీలు దిగారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement