ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నెలకొన్ని వాటర్ వార్‌పై స్పందించారు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్. తెలంగాణ తీసుకుంటున్న నిర్ణయాల వల్లే ట్రిబ్యునల్ ఏర్పాటులో జాప్యం జరుగుతోందన్నారు కేంద్ర మంత్రి. ఈ రోజు మీడియాతో షెకావత్ మాట్లాడారు. ‘‘మొన్నటి ప్రెస్‌మీట్‌లో కావాలని సీఎం కేసీఆర్ నా పేరు ప్రస్తావనకు తెచ్చారు. అందుకని నేను రెస్పాండ్ కావాల్సి వస్తోంది. అస్సలు నాకు దానితో సంబంధమే లేదు.
కావాలనే కేంద్రాన్ని కేసీఆర్ బద్నాం చేస్తున్నారు. ఇద్దరు సీఎం అంగీకారం తర్వతే ట్రిబ్యునల్ ఏర్పాటు జరుగుతుంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. అయితే నెల క్రితమే సుప్రీంకోర్టు పిటిషన్ ఉపసంహరణకు అనుమతిచ్చింది. ప్రభుత్వాలు యాక్టివ్‌గా ఉండి బోర్డులతో కలిసి పనిచేయాలి. ఇలా మాటిమాటికి వివాదాలు సృష్టించుకోవడం అంత మంచిది కాదు’’ అన్నారు కేంద్ర మంత్రి షెకావత్