Thursday, November 21, 2024

Breaking : క‌ర్నాట‌క‌లో రెండు ఒమిక్రాన్ కేసులు .. ఆరోగ్య‌శాఖ అధికారుల‌తో ప్ర‌ధాని అత్య‌వ‌స‌ర భేటీ ..

ఓమిక్రాన్ వేరింయంట్ ఇప్పుడు అంద‌రిని ఆందోళ‌న‌కి గురి చేస్తోంది.. కాగా క‌ర్నాట‌క‌లో రెండు కేసులు న‌మోద‌య్యాయి. ఈ మేర‌కు కేంద్ర వైద్య ఆరోగ్య‌శాఖ ధృవీక‌రించారు. జినోమ్ సీక్వెనింగ్ లో వెల్ల‌డ‌యింది. సౌతాఫ్రికా నుంచి వ‌చ్చిన ఇద్ద‌రికి ఒమిక్రాన్ గా నిర్ధార‌ణ అయింది. 24గంట‌ల్లో రెండు ఒమిక్రాన్ కేసులు గుర్తించారు. వారితో ట‌చ్ లో ఉన్న‌వారిని ట్రేస్ చేస్తున్నారు అధికారులు..ఒక‌రికి 66ఏళ్లు కాగా .. మ‌రొక‌రికి 46ఏళ్ళు..దాంతో తెలంగాణ ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మ‌యింది. ఓమిక్రాన్ దేశంలో మ‌రింత‌గా ప్ర‌బ‌లే ప్ర‌మాదం ఉంది. కాగా వైద్య ఆరోగ్య‌శాఖ అధికారుల‌తో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అత్య‌వ‌స‌ర భేటీ కానున్నారు.

ఇటీవల బెంగళూర్ కు వచ్చిన ఇద్దరిలో ఈ వేరియంట్ కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర హెల్త్ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ తెలిపారు. ఇన్నాళ్లు విదేశాలకే పరిమితమైన ఓమిక్రాన్ భారత్ లో కూడా నమోదవ్వడం దేశ ప్రజల్ని కరవరపరుస్తోంది. దాదాపు 29 దేశాల్లో ఇప్పటివరకు ఓమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. తాజాగా ఓమిక్రాన్ జాబితాలో ఇండియా కూడా చేరింది. మరోసారి అప్రమత్తంగా ఉండాలని కేంద్రం ప్రజలకు సూచించింది. అత్యంత వేగం దాదాపు డెల్టా వేరియంట్ తో పోలిస్తే ఓమిక్రాన్ వేరియంట్ ఐదు రెట్లు వేగంగా వ్యాపించే అవకాశం ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement