భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా ట్విట్టర్ ఖాతా హ్యాక్ చేయబడింది. వారి ప్రమేయం లేకుండా.. ఉక్రేనియన్ల కోసం క్రిప్టోకరెన్సీ విరాళాలు కోరుతూ ఆదివారం ఒక ట్వీట్ పోస్ట్ చేయబడింది. ఉక్రెయిన్ పౌరులకు అడ్డంగా నిలబడండి. ఇప్పుడు క్రిప్టోకరెన్సీ విరాళాలను స్వీకరిస్తున్నారు. బిట్‌కాయిన్ , ఎథెరియం అని ట్వీట్లో పేర్కొన్నారు.దీంతో తన అకౌంట్ హ్యాకింగ్ అయినట్టు ప్రకటించారు. క్షమించండి నా ట్వట్టర్ ఖాతా హ్యాక్ అయిందని జెపి నడ్డా వెల్లడించారు. ఈ రోజు, 5వ దశ యుపి అసెంబ్లీ ఎన్నికలలో మొత్తం 61 సీట్ల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని , రాష్ట్రంలో బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో తమ వంతు పాత్ర పోషించాలని ఆయన కోరారు. మొదటిసారి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు ఓటర్లు ముందుకు రావాలని కోరారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement