జగ్గయ్యపేట ఎమ్మెల్యే ఉదయభానుకు ఏపీ హైకోర్టులో చుక్కెదురయింది. కేసుల ఉపసంహరణ వ్యవహారంలో ఉదయభానుకు హైకోర్టు నోటీసులు పంపింది.ఎమ్మెల్యే ఉదయభానుపై 10కేసులు ఉపసంహరించుకుంటూ ప్రభుత్వం ఇచ్చిన జీవోలను హైకోర్టులో సవాల్ చేశారు ఏపీజేఎఫ్ అధ్యక్షుడు కృష్ణాంజనేయులు. పిటిషనర్ల తరపున వాదించారు న్యాయవాది జడ శ్రవణ్. ఒక్క జీవోతో 10కేసులు ఎలా ఉపసంహరించుకుంటారని ధర్మాసనం ప్రశ్నించింది. ప్రభుత్వం జీవో ఇవ్వాల్సిన అవసరం ఏంటని హైకోర్టు ప్రశ్నించింది. ఎమ్మెల్యే ఉదయభాను,హోం శాఖ ముఖ్యకార్యదర్శి,డీజీపీకి హై కోర్టు నోటీసులు ఇచ్చింది. మూడు వారాల్లో కౌంటర్ దాఖలుకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Breaking : ఉదయభానుకు హైకోర్టులో చుక్కెదురు..హోం శాఖ ముఖ్యకార్యదర్శి,డీజీపీకి నోటీసులు..
Advertisement
తాజా వార్తలు
Advertisement