ఫిబ్రవరి 16 నుండి తిరుపతిలో ఆఫ్ లైన్ ద్వారా సర్వదర్శనం టోకెన్లను జారీ చేయనున్నామని టిటిడి ఈవో జవహర్ రెడ్డి స్పష్టం చేశారు. రోజుకు పది వేలు టోకెన్ లని ఆఫ్ లైన్ ద్వారా కేటాయిస్తామన్నారు. ఆర్జిత సేవలు పునరుద్ధరణ సంబంధించి టీటీడీ బోర్డు లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తిరుమలలో ప్లాస్టిక్ బ్యాన్ పై కమిటీని నియమించామని, బయోడిగ్రేడబుల్ లడ్డూ కవర్లను ప్రవేశపెట్టామన్నారు. త్వరలోనే తిరుమలలో అన్ని దుకాణాలలో బయోడిగ్రేడబుల్ సంచులు వాడేలా చర్యలు తీసుకుంటామన్నారు. హనుమాన్ జన్మస్థలం అభివృద్ది చేస్తామని, అక్కడ ఫిబ్రవరి 16వ తేదీ ఉదయం 9:30 గంటలకు భూమి పూజ నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. తరిగొండ వెంగమాంబ బృందవనం పనులు ఫిబ్రవరి16న ప్రారంభిస్తామని ఈవో తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..