భారీ పరిశ్రమల ఏర్పాటుకు నీరు, కరెంట్ అవసరం..కానీ మధ్యప్రదేశ్ లో ఈ రెండింటీకీ కొరత లేదన్నారు సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్. ఇండోర్ లో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023లో ఆయన మాట్లాడారు.పెట్టుబడులకు మధ్యప్రదేశ్ అనువైన చోటని అన్నారు.అన్నిరంగాల్లో భారత్ సత్తా చాటుతోందన్నారు.ప్రధాని మోడీ నాయకత్వమే దీనికి కారణమని చెప్పారు. శాంతిభద్రతలో కూడా మధ్యప్రదేశ్ టాప్ అని అన్నారు.ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్.. గుడ్ గవర్నెన్స్ లో కూడా మేమే టాప్ అన్నారు. వజ్రాలు..బొగ్గు..మైనింగ్ పెట్టుబడులకు అనువైన అవకాశాలు ఉన్నాయన్నారు. మధ్యప్రదేశ్ కి ఉన్న ల్యాండ్ బ్యాంక్ ఏ రాష్ట్రానికి లేదన్నారు.లండన్ కంటే ఇండోర్ రోడ్లు బాగున్నాయని ఎన్ఆర్ ఐలు అంటున్నారని చెప్పారు.దేశ వృద్ధిరేటులో మధ్యప్రదేశ్ ది కీలకపాత్రని చెప్పారు.ఇక్కడి ప్రజల తలసరి ఆదాయం మిగతా రాష్ట్రాలతో పొల్చితే ఎక్కువని శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు.
Breaking: అన్నిరంగాల్లో భారత్ సత్తా.. మోడీ నాయకత్వమే కారణం.. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్
Advertisement
తాజా వార్తలు
Advertisement