తెలంగాణలో విద్యుత్ ఛార్జీలు పెరిగాయి. 14శాతం విద్యుత్ ఛార్జీలను పెంచుతై టీఆఎస్ ఈఆర్సీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 19శాతం పెంపునకు అనుమతికోరాయి డిస్కంలు. డొమెస్టిక్ పై 40-50పైసల పెంపు.. ఇతర కేటగిరీలపై యూనిట్ కు రూపాయి చొప్పున పెంపు.19 శాతం విద్యుత్ చార్జీల పెంపునకు అనుమతి కోరగా… 14 శాతం మాత్రమే విద్యుత్ ఛార్జీలను పెంచుతూ తెలంగాణ ఈఆర్ఎసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక దీనిపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఫైనల్ నిర్ణయం తీసుకోనున్నారు. దీనిపై సీఎం కేసీఆర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. ఒకవేళ సీఎం కేసీఆర్ చార్జీల పెంపు కే మొగ్గు చూపితే… తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ ఒకటో తేదీ నుండి కరెంటు చార్జీలు పెరగనున్నాయి. దీంతో తెలంగాణ రాష్ట్రంలోని నిరుపేదల పై భారం పడనుంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement