హిజాబ్ కు పోటీగా కాషాయకండువా ధరించారు విద్యార్థులు. దాంతో రెండు వర్గాల మధ్య పరస్పరం వాగ్వాదం నెలకొంది. కాగా నేడు హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టులో విచారణ జరగనుంది. దాంతో కోర్టు ఏం చెబుతుందన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. కర్నాటకలో హిజాబ్ రగడ కొనసాగుతూనే ఉంది. ఉడుపి ఎంజీఎం కాలేజ్ విద్యార్థుల మధ్య ఘర్షణ నెలకొంది. హిజాబ్ మహిళలకు జైభీమ్ విద్యార్థులు మద్దతు ఇచ్చారు. కర్ణాటకలో ‘ హిబాజ్’ వ్యవహారం రాజుకుంటోంది. విద్యార్థులు రెండు వర్గాలుగా విడిపోయారు. స్కూళ్లు, కాలేజీల్లో తప్పకుండా యూనిఫాం పాటించాలని బస్వరాజ్ బొమ్మై సర్కార్ స్పష్టం చేసింది.
అయితే కొంత మంది మాత్రం తమ మతాచారాలకు అనుగుణంగా హిజాబ్ ధరించి స్కూళ్లకు, కాలేజీలకు వస్తున్నారు. దీంతో మరో వర్గం విద్యార్థి, విద్యార్థినిలు కాషాయ కండువాలతో కాలేజీలకు హాజరవుతున్నారు. దీంతో విద్యార్థులు రెండు వర్గాలుగా విడిపోయి.. పోటాపోటీగా నినాదాలు, నిరసనలు తెలపడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారుతోంది. అయితే ఇలా వచ్చే వారిని స్కూళ్లు, కళాశాల యజమాన్యాలు తరగతులకు అనుమతించడం లేదు. దీంతో గేటుమందే ధర్నాలు, నిరసనలు చేస్తున్నారు. ఉడిపి జిల్లాలో ప్రారంభమైన ఈ వివాదం మెల్లిగా… బెలగావి, శివమొగ్గ, కొప్పెల ప్రాంతాలకు కూడా పాకింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..