రష్యా అధ్యక్షుడు పుతిన్ సేనలను ధీటుగా ఎదుర్కొంటున్నాయి ఉక్రెయిన్ సైన్యం..రష్యన్ బలగాలు కీవ్ లో ప్రవేశించకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. కీవ్ ను ఆక్రమించుకునేందుకు అస్త్రశస్త్రాలు ప్రయోగిస్తోంది రష్యా. కీవ్ ను రష్యన్ బలగాలు చుట్టుముట్టాయి. ఈ మేరకు ఉక్రెయిన్ పై బాంబుల వర్షం కురిపిస్తోంది రష్యా. సుమీపై విరుచుకుపడింది రష్యన్ సైన్యం. సుమిఖిమ్ ప్రోమ్ కెమికల్ ప్లాంట్ పై రాకెట్లతో దాడి చేసింది. పవర్ ప్లాంట్ నుంచి అమ్మోనియా గ్యాస్ లీక్ అయింది. సుమిఖిమ్ ప్రోమ్ లో హై అలర్ట్ ని ప్రకటించారు.5కిలోమీటర్ల వరకు ప్రభావం ఉంటుందని హెచ్చరికలు జారీ చేశారు. కాగా రష్యా దూకుడుకు బ్రేకులేయడంపై అమెరికా ఫోకస్ పెట్టింది. 25న పోలెండ్ కు వెళ్లనున్నారు అమెరికా అధ్యక్షుడు బైడెన్. ఈ మేరకు వార్సాలో పోలెండ్ అధ్యక్షుడితో బైడెన్ సమావేశం కానున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..