Saturday, November 23, 2024

Breaking: కోఠి ఏరియాలో హెవీ ట్రాఫిక్‌.. అటువైపు వెళ్లే వాళ్లు జర పైలం

హైద‌రాబాద్ సిటీ అంటేనే ట్రాఫిక్ చ‌ద‌రంగంలా ఉంటుంది. సిటీలో ఏ మూల‌కు వెళ్లినా.. ఏడ చూసినా ట్రాఫిక్ ఇక్క‌ట్లు త‌ప్ప‌వు. రోడ్ల నిండా వెహిక‌ల్స్… స‌ముద్రంలో ఈదుకుంటు వెళ్లిన‌ట్టు ఉంటుంది ప‌రిస్థితి.. అయితే ఈ రోజు మాత్రం ఇంకాస్త ట్రాఫిక్ ఎక్కువే ఉందంటున్నారు హైద‌రాబాద్ ట్రాఫిక్ పోలీసులు..

నాంప‌ల్లి నుంచి ట్రాఫిక్ పెరిగింద‌ని ట్విట్ట‌ర్‌లో అప్‌డేట్ ఇచ్చారు ట్రాఫిక్ పోలీసులు. కోఠి ఏరియాలోని బ్యాంక్ స్ట్రీట్, కోఠి, ఆంధ్రా బ్యాంక్, DMHS, ఇస్లామియా బజార్ నుంచి ఛాదర్‌ఘాట్ జంక్షన్ దాకా.. అటువైపు దిల్‌సుఖ్‌న‌గ‌ర్ వెళ్లే కాజ్‌వే రోడ్డు వైపు కూడా హెవీ ట్రాఫిక్ ఉంద‌ని తెలిపారు. అందుక‌ని ఆ రూట్‌లో వెళ్లే వాహ‌న‌దారులు కాస్త వెసులుబాటు చూసుకుని వెళ్తేనే మంచిది. లేకుంటే హెవీ ట్రాఫిక్‌లో ఇరుక్కొని ఇబ్బందులు ప‌డాల్సి ఉంటుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసంఫేస్‌బుక్‌ట్విట‌ర్పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement