యాదాద్రిలో సీఎం కేసీఆర్ పర్యటించారు. భూముల విలువలు విపరీతంగా పెరిగాయన్నారు. హైదరాబాద్ – వరంగల్ కారిడార్ అద్భుతంగా డెవలప్ అవుతుందన్నారు. సమైక్య రాష్ట్రంలో చెరువుల్ని నాశనం చేశారని చెప్పారు. మిషన్ కాకతీయతో చెరువుల్ని అభివృద్ధి చేశామన్నారు. ఈ పథకం వెనుక ఎంతో కృషి ఉందన్నారు. భువనగిరి జిల్లా అవుతుందని ఎవరూ అనుకోలేదని కేసీఆర్ తెలిపారు. ఇప్పుడు అందరూ సిపాయిల్లా మాట్లాడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో 2,600క్లస్టర్లు ఏర్పాటు చేశామన్నారు. యాదాద్రి పూర్తయితే వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. తెలంగాణ వచ్చాక సంపద బాగా పెరిగిందన్నారు. యాదాద్రి కూడా హైదరాబాద్ లో కలిసిపోతుందన్నారు. తెలంగాణ అద్భుతమైన ఆర్థికశక్తిగా ఎదుగుతోందని కేసీఆర్ చెప్పారు. ఉద్యోగులకు కేంద్రం కంటే ఎక్కువ జీతాలు ఇస్తున్నామన్నారు. ఉద్యోగుల జీతాలు ఇంకా పెరుగుతాయన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..