Saturday, November 23, 2024

Breaking : ఫ్యామిలీతోనే ప‌బ్ కి వెళ్ళినా – డ్ర‌గ్స్ తో సంబంధం లేదు – సింగ‌ర్ రాహుల్

ప‌బ్ లో పార్టీకి ఫ్యామిలీతో వెళ్లాన‌ని సింగ‌ర్ రాహుల్ సిప్లింగంజ్ తెలిపాడు. ఫ్యామిలీతో వీకెండ్ చిల్ కావ‌డానికి వెళితే త‌ప్పేంట‌ని ప్ర‌శ్నించాడు. మీడియా, వెబ్ సైట్ల‌ల్లో ఇష్ట‌మొచ్చిన‌ట్టు రాస్తున్నారు..అడ్డంగా దొరికిపోయాడ‌ని క‌థ‌నాలు వ‌స్తున్నాయి. కాగా పోలీసుల‌ను ప‌లువురు ప‌బ్ నుంచి పారిపోయార‌ని చెప్పాడు. డ్ర‌గ్స్ కి నాకు ఎలాంటి సంబంధం లేద‌ని స్ప‌ష్టం చేశాడు. పోలీసుల విచార‌ణ‌కి పూర్తిగా స‌హ‌క‌రిస్తాన‌ని రాహుల్ వెల్ల‌డించాడు. ఏ విచార‌ణ‌కు అయినా సిద్ధంగా ఉన్నాను. నా శాంపిల్స్ ఇవ్వ‌డానికి నేను ఎప్పుడైనా రెడీ అన్నారు. డ్ర‌గ్స్ ఎవ‌రైనా తీసుకుంటే ఈ సారి నేనే ప‌ట్టిస్తాన‌న్నారు. త‌ప్పు చేయ‌క‌పోయినా నాపై వివాదాలు సృష్టిస్తున్నార‌ని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement