Saturday, November 23, 2024

Breaking : కాంగ్రెస్ కి గులాం న‌బీ ఆజాద్ గుడ్ బై- సోనియాగాంధీకి రాజీనామా లేఖ‌ని పంపిన సీనియ‌ర్ నేత‌

కొంత‌కాలంగా కాంగ్రెస్ పార్టీ నాయ‌క‌త్వంపై సీనియ‌ర్ నేత గులాం న‌బీ ఆజాద్ గుస్సాగా ఉన్నారు. ఈ మేర‌కు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి రాజీనామా లేఖ‌ని పంపారు గులాంన‌బీ ఆజాద్. ఈ మేర‌కు సోనియాగాంధీకి 5పేజీల లేఖ‌ని రాశారు.పార్టీని వీడ‌టం బాధ‌గా ఉంద‌ని తెలిపారు. కాగా జ‌మ్మూ కశ్మీర్ లో బలపడేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్న కాంగ్రెస్ కి ఇది పెద్ద దెబ్బ అని చెప్పాలి. అయితే జమ్ము కశ్మీర్ లో మంచి పట్టున్న కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ ను జమ్మూ కశ్మీర్ ప్రచార కమిటీ ఛైర్మన్ గా కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. అయితే తాను ఆపదవిని తిరస్కరిస్తున్నట్లు తెలుపుతూ.. రాజీనామా చేశారు. అనారోగ్య కారణాలతో తాను కొత్త బాధ్యతలను స్వీకరించలేనని గులాం నబీ ఆజాద్ ప్రకటించారు. జమ్మూ కశ్మీర్ లో 11 మందితో కాంగ్రెస్ పార్టీ కొత్తగా ప్రచార కమిటీని ఏర్పాటుచేసింది. ఈకమిటీలో పీసీసీ చీఫ్ తో పాటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శాశ్వత ఆహ్వానితులుగా ఉంటారు.

జిఎం సరూరి కన్వీనర్ గా.. తారిఖ్ హామీద్ ప్రచార కమిటీ వైస్ ఛైర్మన్ గా నియమితులయ్యారు.కాంగ్రెస్ పార్టీలో మార్పు అవసరమని గులాం నబీ ఆజాద్ పార్టీలో ఉంటూనే తన గళాన్ని గట్టిగా వినిపించారు. కేంద్రమంత్రిగానూ పనిచేసిన ఆయనకు మంచి ట్రబుల్ షూటర్ గా పేరుంది. దీంతో జమ్మూ కశ్మీర్ లో త్వరలో ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో పార్టీని బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ ఓ ప్రయత్నాన్ని ప్రారంభించింది. కమిటీ ప్రకటించిన గంటల వ్యవధిలోనే కాంగ్రెస్ కు గులాంనబీ ఆజాద్ షాకిస్తూ.. తాను కొత్త బాధ్యతలను స్వీకరించనని తెలిపారు. తనకు బాధ్యతలు ఇచ్చినందుకు కాంగ్రెస్ అధిష్టానానికి కృతజ్ఞతలు చెప్పిన గులాం నబీ ఆజాద్.. అనారోగ్య సమస్యలతో తాను రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. అఖిల భారత కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీలో ఉన్న తనని జమ్ము కశ్మీర్ ప్రచార కమిటీ ఛైర్మన్ గా నియమించి తన హోదా తగ్గించారనే భావనలో ఉన్నారు గులాం నబీ ఆజాద్ . కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్న ఆయన.. పార్టీలో సంస్థాగత మార్పులు కావాలని కోరుతూ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి లేఖరాసిన 23 మంది నేతల్లో గులాం నబీ ఆజాద్ ఒకరు.ఇక ఇప్పుడు ఏకంగా పార్టీకి రాజీనామా చేయ‌డం గ‌మ‌నార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement