సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో జీనోమ్ సీక్వెన్సింగ్ అందుబాటులోకి రాబోతుంది. ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న క్రమంలో అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం.. ఒమిక్రాన్‌ను గుర్తించే జీనోమ్ సీక్వెన్సింగ్‌ను ఏర్పాటు చేస్తోంది. సోమాలియా నుంచి వచ్చిన వ్యక్తికి కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ కావడంతో ముందుగా టిమ్స్‌కు తరలించి చికిత్స అందించారు. అతని ఆరోగ్య పరిస్థితి విషమించడంతో టిమ్స్ నుంచి గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
గాంధీ ఆసుపత్రిలో ఒమిక్రాన్ జీనోమ్ సీక్వెన్సింగ్ అందుబాటులోకి వస్తే, రోజుకు 48శాంపిళ్లను పరీక్షించే అవకాశం ఉంటుందని అధికారులు అంటున్నారు. ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న ఈ ప్రక్రియ అందుబాటులోకి వస్తే పని వేగంగా జరుగుతుందని అభిప్రాయపడ్డారు డాక్టర్లు. గాంధీలోనే జీనోమ్ సీక్వెన్సింగ్‌తో త్వరగా ఫలితాలు వచ్చే అవకాశం ఉందన్నారు. భారత్‌పై ఒమిక్రాన్ వేరియంట్ తన ప్రతాపాన్ని చూపిస్తోండగా.. వైరస్ సోకినవారి సంఖ్య ప్రతిరోజు పదుల సంఖ్యలో నమోదువుతున్నాయి. మొత్తం 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కొత్త వేరియంట్ వ్యాపిస్తోంది. ఇండియాలో ఇప్పటికే ఒమిక్రాన్ బాధితుల సంఖ్య 173కు చేరింది.