పార్కులో తన పెంపుడు కుక్కతో పరుగెడుతుండగా థాయ్ లాండ్ కి కాబోయే యువరాణి బజ్రకితియభ ఖావోకి హార్ట్ ఎటాక్ వచ్చింది. దాంతో ఆమె ఒక్కసారిగా అక్కడే కుప్పకూలిపోయింది. గంట పాటు సీపీఆర్ (కార్డియోపల్మొనరీ రీససియేషన్) చేసినా కూడా ఆమెలో స్పందన లేకపోవడంతో విషయాన్ని వెంటనే థాయ్ రాజు వజిరలాంగ్ కార్న్‌కు తెలియజేశారు. ఆయన హెలికాప్టర్‌లో కుమార్తెను తీసుకొని నార్త్ బ్యాంకాక్ వెళ్లారని మిర్రర్ పత్రిక తెలిపింది. గుండెపోటుతో కుప్పకూలిన యువరాణికి గంటకు పైగా సీపీఆర్ చేసినా కూడా ఆమె స్పందించలేదు. దాంతో, ఆమెకు ఆక్సిజన్ అందించేందుకు ఎక్మో మెషిన్ పెట్టారు. ఆమెను మిలిటరీ హెలికాప్టర్‌లో ఆస్పత్రికి తరలించారు అని అండ్రూ మ్యాక్ గ్రెగర్ మార్షల్ అనే జర్నలిస్ట్ వెల్లడించాడు. థాయ్‌లాండ్‌కు తర్వాత కాబేయే యువరాణి బజ్రకితియభ గుండెపోటుతో కుప్పకూలడంతో రాజకుటుంబం ఆందోళనలో ఉంది.
Breaking : థాయ్ లాండ్ కి కాబోయే యువరాణికి హార్ట్ ఎటాక్.. మిలటరీ హెలికాఫ్టర్ లో ఆసుపత్రికి తరలింపు
Advertisement
తాజా వార్తలు
Advertisement