Monday, November 25, 2024

Breaking : రూ. 100కోట్లు విరాళం ఇచ్చిన – మాజీ ఐఐటీ కాన్పూర్ విద్యార్థి

మాజీ ఐఐటీ కాన్పూర్ విద్యార్థి త‌న ఇన్ స్టిట్యూట్ కి రూ. వంద కోట్ల విరాళం ఇచ్చాడు. ఇప్పటి వరకు ఇన్‌స్టిట్యూట్ చరిత్రలో పూర్వ విద్యార్థి అందించిన అతిపెద్ద ఆర్థిక సహాయం ఇదే. స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ అభివృద్ధికి సహాయం చేయడానికి ఈ డబ్బు ఇచ్చారు.ఇండిగో విమానయాన సంస్థ సహ వ్యవస్థాపకుడు , బిలియనీర్ వ్యాపారవేత్త అయిన రాకేష్ గంగ్వాల్ ఈ మొత్తాన్ని ఐఐటి-కాన్పూర్‌కు విరాళంగా ఇచ్చారు. క్యాంపస్‌లో 500 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించడానికి కూడా డబ్బు ఉపయోగించబడుతుంది.ఈ ప్రాజెక్టుకు దాదాపు రూ.600 కోట్లు ఖర్చవుతుంది. అందులో ఇప్పటి వరకు రూ.350 కోట్లు సమకూరింది.

ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ అభయ్ కరాండీకర్ మాట్లాడుతూ ..రాకేష్ గంగ్వాల్ ఆర్థిక సహాయం , ఎంఓయూ ఇన్‌స్టిట్యూట్‌లో ఏర్పాటవుతున్న స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీని మరింత మెరుగుపరచడంలో, పరిశోధనా పనిని ప్రోత్సహించడంలో దోహదపడుతుందని అన్నారు. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఐఐటీ-కాన్పూర్, రాకేష్ గంగ్వాల్ మధ్య ఎంఓయూ కుదిరింది. రాకేష్ గంగ్వాల్ కోల్‌కతాకు చెందినవాడు. 1975లో IIT కాన్పూర్‌లో మెకానికల్ ఇంజనీరింగ్ చదివాడు. 1980లో, అతను ఎయిర్‌లైన్ పరిశ్రమలో చేరాడు.. తరువాత ఇండిగో ఎయిర్‌లైన్స్ సహ వ్యవస్థాపకుడు అయ్యాడు. గతంలో ఫ్లిప్‌కార్ట్‌కి చెందిన బిన్నీ బన్సాల్ కూడా ఐఐటీ-ఢిల్లీకి రూ.100 కోట్లు విరాళంగా ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement